![]() |
![]() |
.webp)
ఆట సందీప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ సెవెన్ లో అడుగుపెట్టి ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు. అయితే సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ కూడా ఓ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. వీళ్లిద్దరూ కలిసి ఓ డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేసి టైటిల్ గెలిచారు. అయితే తాజాగా జ్యోతి రాజ్‌పై కొంతమంది నెటిజన్లు బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు. దీంతో హర్ట్ అయిన ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చింది. తాజాగా ఆమె సింగిల్‌గా చేసిన ఓ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి కొంతమంది నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెట్టారు. మెల్లగా చెయ్ కింద బండలు పగిలిపోతాయ్.. ఇంత డ్యాన్స్ వేస్తుంటావు అయిన ఇంత లావుగా ఉంటావేంటి అంటూ పర్సనల్ కామెంట్లు చేశారు. దీంతో హర్ట్ అయిన జ్యోతి రాజ్ .. తను రెగ్యులర్ గా చేసే పనులన్నింటిని చూపిస్తూ ఓ వీడియోని షేర్ చేసింది.
ఆ వీడియో కింద జ్యోతి రాజ్ తన మనసులోని భాదని పంచుకుంది. అవును నేను లావుగా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్నాను. అయినా నేను ఒక వర్కింగ్ ఉమెన్‌ని, అలానే బాధ్యతగల మహిళని, నాకంటూ ఓ ప్యాషన్ ఉంది. నేను బ్యూటీని, బాడీ స్ట్రక్చర్‌ని నమ్మను. చేసే పనిని మాత్రమే నమ్ముతాను. అయిన ఇంటి పని, వంట పనిచేస్తూ ఫ్యామిలీ కోసం వర్కింగ్ ఉమెన్‌గా కూడా ఉండటం అంత ఈజీ కాదు. అంటు రాసుకొచ్చింది. ఈ వీడియోలో మార్కెట్‌కి వెళ్లి కూరగాయలు తేవడం నుంచి తన కుటుంబానికి టేస్టీగా వండి వడ్డించడం వరకు జ్యోతి రాజ్ చూపించింది.
ఈ వీడియోకి తన భర్త సందీప్ కూడా ఓ కామెంట్ పెట్టారు. అలాంటి కామెంట్లు పట్టించుకోకు.. ఓ మంచి హృదయం ముందు ఎలాంటి అందం కూడా పనిచేయదంటూ సందీప్ కామెంట్ పెట్టాడు. ఇక ఈ వీడియోను పోస్ట్ చేసిన జ్యోతిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
![]() |
![]() |